Friday, May 22, 2026
Technology

April Month Launch Mobile 2024: ఏప్రిల్‌ చివరి వారాల్లో లాంచ్‌ కాబోయే మొబైల్స్‌ ఇవే!

April Month Launch Mobile 2024 In India: ప్రతి నెల ఏదో ఒక స్మార్ట్ ఫోన్ విడుదల అవుతూనే ఉంటుంది. మార్కెట్లోని కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సంవత్సరంలోని 12 నెలల పాటు ఏదో ఒక మొబైల్ ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ప్రీమియం మొబైల్స్ ను ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. అంతేకాకుండా మరికొన్ని కంపెనీలు అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్ తో కూడిన మొబైల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. కస్టమర్స్ కూడా వీటి ఫీచర్లకు ఫిదా అయ్యి వెంటవెంటనే కొత్త కొత్త మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అయితే ప్రతి నెల తప్పకుండా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎక్కువగా మొబైల్స్ ను విడుదల చేసే బ్రాండ్ల విషయానికొస్తే.. వన్ ప్లస్, రెడ్మి, సాంసంగ్, రియల్ మీ, వివో, ఒప్పో ముందు స్థానంలో ఉన్నాయి. జనాలు కూడా ఈ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ బ్రాండ్లలో కొన్ని సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరల్లోనే ప్రీమియం కెమెరా బ్యాటరీ కలిగిన మొబైల్స్ ను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్లో రెడ్మి, రియల్ మీ స్మార్ట్ ఫోన్ కంపెనీలు లాంచ్ చేసిన మొబైల్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే కంపెనీలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లో కొత్త మొబైల్స్ ను తీసుకు వస్తున్నాయి.

ప్రతి నెల లాగే ఏప్రిల్ నెలలో కూడా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎంతో శక్తివంతమైన ఫీచర్లతో కూడిన కొన్ని మొబైల్స్ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్స్, విడుదల తేదీ ఇతర వివరాలు లాంచింగ్ ముందే లీక్ అయ్యాయి. ఏప్రిల్ నెలలో మొత్తం పది బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ దాదాపు 12 జిబి రామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడుకున్నవేనని టిప్ స్టర్స్ అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఉప్పు విడుదల చేయబోయే ఫైండ్ మొబైల్ ఎంతో శక్తివంతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో లాంచ్ కాబోయే టాప్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో లాంచ్ కాబోయే టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవే:
ఒప్పో ఫైండ్ X6:
త్వరలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ తెలుపబోతుంది. ఎంతో శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ కలిగిన ఒప్పో ఫైండ్ X6 స్మార్ట్ ఫోన్ ని ఏప్రిల్ నెలలో లాంచింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్ త్రిపుల్ కెమెరా సెటప్ తో అత్యంత శక్తివంతమైన 5000 mah బ్యాటరీ తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది దీంతోపాటు ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్ తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒప్పో ఫైండ్ X6 ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7-అంగుళాల AMOLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్
12GB RAM, 512GB స్టోరేజ్
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
32MP సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్

Read More Vivo Y200 Pro: Vivo మార్కెట్‌లో సంచలనం సృష్టించబోతోంది! త్వరలోనే Vivo Y200 Pro వచ్చేస్తోంది!

షావోమి 13s:
చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ షావోమికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది లాంచ్ చేసే మొబైల్స్ ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ ను లాంచ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిడిల్ క్లాస్ కస్టమర్స్ కోసం అప్పుడప్పుడు రూ. 6 లోపు కూడా స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఈ మొబైల్ కంపెనీ త్వరలోనే షావోమి 13s లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ మొదటి వారంలో లేదా రెండో వారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది కూడా ఎంతో శక్తివంతమైన 5000mah బ్యాటరీతో పాటు 120 వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

షావోమి 13S ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.81-అంగుళాల AMOLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్
12GB RAM, 512GB స్టోరేజ్
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ (Leica బ్రాండింగ్)
32MP సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్

రియల్ మీ జిటి 3 ప్రో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
భారత మార్కెట్లో రెడ్మి స్మార్ట్ ఫోన్ కంపెనీకి ఎంత గుర్తింపు ఉందో రియల్ మీ కంపెనీకి కూడా అంతే గుర్తింపు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ కూడా ప్రీమియం రేంజ్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను సాధారణ బడ్జెట్లో విక్రయిస్తూ వస్తోంది. అందుకే రియల్ మీ భారతదేశ వ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కంపెనీ అతి త్వరలోనే తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ ను అందించబోతోంది. రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ మూడో వారంలో లేదా నాలుగో వారంలో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రియల్ మీ జిటి 3 ప్రో మోడల్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాంచింగ్ కి ముందే ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం ఈ మొబైల్ బేస్ మాడలే 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

రియల్‌మీ GT 3 Pro ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7-అంగుళాల AMOLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్
16GB RAM, 512GB స్టోరేజ్
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
32MP సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ చార్జింగ్

వివో x90 ప్రో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
భారతదేశంలో వివో మొబైల్స్ ను అతి శక్తివంతమైన కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్ గా పిలుస్తారు. ఎందుకంటే ఈ కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసే ప్రతి మొబైల్ ఎంతో శక్తివంతమైన ప్రీమియం కెమెరాను కలిగి ఉంటుంది. కాబట్టి చిన్న మొబైల్స్ ను విడుదల చేసిన ఎంతో శక్తివంతమైన కెమెరాలను కలిగి ఉంటాయి. మంచి కెమెరా కావాలనుకునే చాలామంది ఈ వివో స్మార్ట్ ఫోన్ లను ఇప్పటికీ కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అయితే వారిని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అతి శక్తివంతమైన కెమెరాతో కలిగిన వివో x90 ప్రో మొబైల్ ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Vivo X90 Pro:
6.78-అంగుళాల AMOLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్
12GB RAM, 512GB స్టోరేజ్
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ (Zeiss బ్రాండింగ్)
32MP సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్

Hello Tech

హలో టెక్‌ న్యూస్‌ తెలుగు అనేది మన తెలుగు భాషలోనే మొదటి లోకల్‌ టెక్నాలజీ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ మీ అందరికీ కొత్త మొబైల్స్‌కి సంబంధించిన సమాచారంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధరలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ముఖ్యంగా లాంచ్‌ కాబోయే గాడ్జెట్స్‌ వాటి పూర్తి వివరాలను కూడా మీకు అందిస్తుంది. దీంతో పాటు ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన రివ్యూస్‌ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో బిజినెస్‌, ఆటో మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *