Best Selling Tata Cars 2024: భారతదేశంలో దుమ్మ రేపిన టాటా కార్లు.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే..
Best Selling Tata Cars 2024: భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా కార్లు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే లక్షల యూనిట్లు అమ్ముడు అవుతున్నాయి. సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన కార్లైతే కొనుగోలు చేసిన రెండు మూడు నెలల తర్వాత డెలివరీ అవుతున్నాయి. అయితే టాటా కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని శక్తివంతమైన ఫీచర్లతో కూడిన కార్లను మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అంతేకాకుండా కంపెనీ డిమాండ్ ను మరింత పెంచేందుకు కార్లపై ఆకర్షనీయమైన డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది. టాటా కార్లు ఇంత సక్సెస్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సేఫ్టీ ఫీచర్స్ ఏనని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ విక్రయాలు దూసుకుపోతోంది. ఈ కారు ఏ గ్రేడ్ సేఫ్టీ ఫీచర్స్ తో అందుబాటులోకి రావడం వల్ల చాలామంది భారతీయులు ఈ కారును కొనుగోలు చేశారు. అంతేకాకుండా టాటా కంపెనీ దీనికి అప్డేట్ వెర్షన్ గా త్వరలోనే ఎలక్ట్రిక్ టాటా పంచ్ కారును కూడా మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఇదిలా ఉండగా జనవరి నుంచి ఫిబ్రవరి నెల నాటికి టాటా కార్లు అమ్మకాల్లో ప్రభంజనం సృష్టించాయి. అత్యధికంగా యూనిట్లను సేల్ చేసిన టాటా కంపెనీ ఇప్పుడు అన్ని బ్రాండ్లకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల కంపెనీ అత్యధికంగా విక్రయించిన కార్లకు సంబంధించిన లిస్టును కూడా వెల్లడించింది. అయితే అత్యధికంగా అమ్మకాల్లో దూసుకుపోయిన టాప్ ఫైవ్ టాటా కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాటా కార్లు (టాప్ 5)
- టాటా పంచ్:
సేఫ్టీ పరంగా టాటా పంచ్ కారు గురించి చెప్పనక్కర్లేదు. ఈ కారు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లోకి లాంచ్ అయింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇది భారతదేశంలో 18,438 యూనిట్ల విక్రయంతో టాప్ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మైక్రో SUV 5-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్ తో పాటు సిఎన్జి వేరియంట్ లో లభిస్తోంది.
టాటా పంచ్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్:
iRA టెక్నాలజీతో కనెక్టెడ్ కార్ ఫీచర్స్
7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
పవర్డ్ టెయిల్‌గేట్
ఐదు స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్
ఎక్స్టర్నల్ ఫీచర్స్:
LED హెడ్‌ల్యాంప్‌లు & టెయిల్‌ల్యాంప్‌లు
16-అంగుళాల అల్లాయ్ వీల్స్
ఫ్రంట్ & రియర్ ఫాగ్ ల్యాంప్‌లు
రూఫ్ రైల్స్
ఎలక్ట్రిక్ ORVMs
పుష్-బటన్ స్టార్ట్
పవర్డ్ టెయిల్‌గేట్
ఇంటీరియల్ ఫీచర్స్:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
క్రూజ్ కంట్రోల్
రియర్ పార్కింగ్ సెన్సార్లు
రియర్ వ్యూ కెమెరా
ఐదు స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్
ఇంజన్ & ట్రాన్స్‌మిషన్:
1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్
5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
- టాటా నెక్సాన్:
ఇక టాటా నెక్సన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. ఈ కారు కూడా సేఫ్టీ పరంగా ఎంతో బాగుంటుంది. ఈ కారు 2024 సంవత్సరం ఫిబ్రవరి వరకు 12,678 యూనిట్ల విక్రయాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ SUV కూడా 5-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ పొందింది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, EV ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది 5-స్టార్ గ్లోబల్ క్రాష్ టెస్ట్ రేటింగ్ కూడా పొందినట్లు టాటా కంపెనీ వెల్లడించింది. ఇవే కాకుండా మరెన్నో శక్తివంతమైన ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.
టాటా నెక్సాన్ టాప్ ఫీచర్స్
భద్రత:
5-స్టార్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్
2 ఎయిర్‌బ్యాగులు (స్టాండర్డ్), 4 ఎయిర్‌బ్యాగులు (XZ+ టాప్ వేరియంట్‌లో)
ABS తో EBD
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
ట్రాక్షన్ కంట్రోల్
హిల్ హోల్డ్ అసిస్ట్
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
కోర్నరింగ్ బ్రేక్ కంట్రోల్
బ్రేక్ అసిస్ట్
ఇతర ఫీచర్స్:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
Android Auto మరియు Apple CarPlay కనెక్టివిటీ
4 స్పీకర్లు (స్టాండర్డ్), 8 స్పీకర్లు (XZ+ టాప్ వేరియంట్‌లో)
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
పవర్ విండోస్
పవర్ అడ్జస్టబుల్ ORVMs
సన్‌రూఫ్
పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
కీలెస్ ఎంట్రీ
ఇంజన్ వివరాలు:
1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ (120 PS శక్తి, 170 Nm టార్క్)
1.5L డీజిల్ ఇంజన్ (110 PS శక్తి, 260 Nm టార్క్)
6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్
6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (XZ+ టాప్ వేరియంట్‌లో)
- టాటా టియాగో:
టాటా కార్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో టాటా టియాగో కూడా ఒకటి. ఈ కారు చూడడానికి చాలా చిన్నదిగా కనిపించిన ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంటుంది అంతేకాకుండా 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ఫిబ్రవరి నెల వరకు 10,017 యూనిట్ల విక్రయాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఇది హ్యాచ్‌బ్యాక్ 4-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ పొందింది. టాటా టియాగో పెట్రోల్, CNG ఇంధన మోడల్స్ లో లభిస్తోంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.
టాటా టియాగో టాప్ ఫీచర్స్:
ఎక్స్టర్నల్ ఫీచర్స్:
LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు
డేటైమ్ రన్నింగ్ లైట్‌లు (DRLs)
15-అంగుళాల అల్లాయ్ వీల్‌లు
ఫోగ్ ల్యాంప్‌లు
బాడీ-కలర్ ORVMs
రియర్ స్పాయిలర్
షార్క్ ఫిన్ యాంటెన
ఇంటర్నల్ ఫీచర్స్:
7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
Android Auto, Apple CarPlay కనెక్టివిటీ
4-స్పీకర్ సౌండ్ సిస్టమ్
మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్
పవర్ విండోస్
పవర్-అడ్జస్టబుల్ ORVMs
టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
టILT-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్
సేఫ్టీ ఫీచర్స్:
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
ABS తో EBD
ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు
కోర్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC)
రియర్ పార్కింగ్ సెన్సార్‌లు
ఇంజిన్ ఇమ్మోబిలైజర్
స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్‌లు
- టాటా హారియర్:
ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV ల్లో మంచి పేరు తెచ్చుకున్న టాటా హారియర్ అమ్మకాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇది చూడడానికి ప్రీమియం లుక్ లో కనిపించడం వల్ల రాజకీయ నాయకులు సైతం ఈ కారును కొనుగోలు చేశారని సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ కారు 3,958 యూనిట్ల విక్రయాలల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ మిడ్-సైజ్ SUV 5-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ఆకర్షణీయమైన రంగులు అందుబాటులో ఉంది. టాటా హారియర్ డీజిల్ మోడల్ లో మాత్రమే లభిస్తోంది.
టాటా హారియర్ టాప్ ఫీచర్స్:
ఎక్స్టర్నల్ ఫీచర్స్:
LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు మరియు DRLs
18-అంగుళాల అల్లాయ్ వీల్‌లు
పనోరమిక్ సన్‌రూఫ్
ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు
360-డిగ్రీ కెమెరా
పవర్డ్ టెయిల్‌గేట్
ఇంటర్నల్ ఫీచర్స్:
10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
JBL 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
డ్యూయల్-టోన్ ఇంటీరియర్
పవర్డ్ డ్రైవర్ సీటు
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
సేఫ్టీ ఫీచర్స్:
6 ఎయిర్‌బ్యాగులు
ABSతో EBD
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
ట్రాక్షన్ కంట్రోల్
హిల్ హోల్డ్ అసిస్ట్
డిస్‌కెంట్ బ్రేక్‌లు
- టాటా టిగోర్:
చిన్న ఫ్యామిలీలు ఎక్కువగా కొనుగోలు చేసిన కార్లలో టాటా టిగోర్ టాప్ లిస్టులో ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. దీంతో పాటు ఇది వివిధ ఫీచర్లతో లభించడమే కాకుండా ఆకర్షణీయమైన కలర్స్లో అందుబాటులో ఉంది. ఫిబ్రవరి నాటికి ఈ కారు 3,604 యూనిట్ల విక్రయంతో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ సెడాన్ 4-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా టిగోర్ పెట్రోల్, CNG ఇంధన మోడల్స్ లో అందుబాటులో ఉంది.
టాటా టిగోర్ టాప్ ఫీచర్స్:
ఎక్స్టర్నల్ ఫీచర్స్:
LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు మరియు DRLలు
15-అంగుళాల అల్లాయ్ వీల్‌లు
ఫోగ్ ల్యాంప్‌లు
శరీరం రంగు ORVMs
ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ORVMs
రియర్ డిఫాగర్
శరీరం రంగు బంపర్లు
పొడవైన యాంటెన్నా
ఇంటర్నల్ ఫీచర్స్:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
Android Auto మరియు Apple CarPlay కనెక్టివిటీ
4 స్పీకర్స్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్
ఎయిర్ కండిషనింగ్
పవర్ విండోస్
సెంట్రల్ లాకింగ్
పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్
ఫోల్డబుల్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్
రియర్ AC వెంట్స్
ఛార్జింగ్ సాకెట్లు
సేఫ్టీ ఫీచర్స్:
డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు
ABS తో EBD
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
రియర్ పార్కింగ్ సెన్సార్లు
స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్‌లు
కోర్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ (CSC)
ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ (ETC)
ఇంజన్, ట్రాన్స్‌మిషన్:
1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్
86 PS శక్తి మరియు 113 Nm టార్క్
5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

