Cng Bike: ప్రపంచంలో మొట్టమొదటి CNG బైక్ వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు ఇవ్వే భయ్యా..
World First Cng Bike: భారత దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ బజాజ్ తన మొదటి CNG బైక్‌ను విడుదల చేయబోతోంది. ఈ బైక్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే ప్రపంచంలోనే తొలి CNG బైక్ కూడా అవుతుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని కంపెనీల చూపు ఈ బైక్‌పైనే పడింది. అంతేకాకుండా కంపెనీ ఈ బైక్‌ను అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌బైక్ వివిధ రకాల కలర్ ఆప్షన్‌లో లాంచ్ కాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
బజాజ్ CNG బైక్ లాంచ్ తేదీ వెల్లడించింది
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను జూలై నెలలో మొదటి వారం అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించి ఆటో నిపుణులందరికీ కంపెనీ ఆహ్వానాలు కూడా పంపింది.
అలాగే మార్కెట్‌లో ఈ బైక్‌కి సంబంధించిన లాంచింగ్ తేది గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ CNG బైక్ జూలై 5న లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో బజాజ్ ఎండి రాజీవ్ బజాజ్, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొంటారు. అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన ఈవేంట్‌ను ఘనంగా జరపబోతున్నట్లు తెలుస్తోంది.
అందమైన డిజైన్‌తో..
ఇటీవలే బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ బజాజ్ CNG బైక్‌పై స్పందించారు. అయితే కంపెనీ దీనిని జూన్ 18నే లాంచ్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల తేదిల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే తమ తొలి సిఎన్‌జి బైక్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే ఈ బైక్‌ను అత్యంత ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి తీసు రాబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

