Friday, May 22, 2026
Gadgets

Samsung 10000Mah Power Bank: సాంసంగ్‌ నుంచి అతి శక్తివంతమైన 10,000mAh బ్యాటరీ కెపాసిటీతో పవర్‌ బ్యాంక్‌ లాంచ్‌..

Samsung 10000Mah Power Bank: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌ 10,000mAh బ్యాటరీ కెపాసిటీతో కూడిన కొత్త పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది. ఈ పవర్‌ బ్యాంక్‌ అనేక రకాల ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిని కంపెనీ ముందుగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటీవలే దీనిని కంపెనీ దీనిని చైనాలో ప్రవేశపెట్టింది. దీనికి ముందు సాంసంగ్ గత నెలలో 20,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పవర్ బ్యాంక్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ పవర్‌ బ్యాంక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung 10000mAh పవర్ బ్యాంక్ ధర
Samsung కంపెనీ ఈ 10,000mAh పవర్ బ్యాంక్ చైనాలో ప్రారంభించింది. దీని ధర 249 యువాన్లు (దాదాపు రూ. 3,000)తో లాంచ్‌ చేసింది. దీనిని JD.com నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. దీని విక్రయాలు ఏప్రిల్ 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. కంపెనీ దీనిని లేత గోధుమరంగు రంగులో ప్రవేశపెట్టింది.

Samsung 10000mAh పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
Samsung 10,000mAh పవర్ బ్యాంక్ లైట్‌ వేయిట్‌తో లభిస్తోంది. దీని బరువు దాదాపు 222 గ్రాములు ఉంటుందని కంపెనీ తెలిపింది. దాని కొలతల విషయానికొస్తే..ఇది 148 x 72 x 16.4 మిమీ ఉంటుంది. ఈ పవర్‌ బ్యాంక్‌ 20cm USB-C, USB-C డేటా కేబుల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని వినియోగించి ఒకేసారి 3 డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు వైర్డు ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం కంపెనీ ప్రత్యేక ప్రత్యేక స్పెస్‌ను అందించింది.

Read More : Ibomma Telugu: ఐబొమ్మలో సింగిల్ క్లిక్‌తో సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?

ఇది శక్తివంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ 7.5W పవర్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీనితో సులభంగా ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. వేగవంతమైన ఛార్జింగ్ కోసం కంపెనీ దీనికి వైర్డు ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇది 25W వరకు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని డిజైన్, మెటీరియల్ విషయానికొస్తే ఇది..పర్యావరణ అనుకూల పరికరమని కంపెనీ తెలిపింది. ఇది UL సర్టిఫైడ్ రీసైకిల్ మెటీరియల్స్ నుంచి తయారు చేశారని కంపెనీ వెల్లడించింది. ఇది 6.8% రీసైకిల్ మెటీరియల్, 30% పోస్ట్ కన్స్యూమర్ రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన్నట్లు పేర్కొంది.

Read More : Ibomma Telugu: ఐబొమ్మలో సింగిల్ క్లిక్‌తో సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?

Hello Tech

హలో టెక్‌ న్యూస్‌ తెలుగు అనేది మన తెలుగు భాషలోనే మొదటి లోకల్‌ టెక్నాలజీ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ మీ అందరికీ కొత్త మొబైల్స్‌కి సంబంధించిన సమాచారంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధరలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ముఖ్యంగా లాంచ్‌ కాబోయే గాడ్జెట్స్‌ వాటి పూర్తి వివరాలను కూడా మీకు అందిస్తుంది. దీంతో పాటు ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన రివ్యూస్‌ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో బిజినెస్‌, ఆటో మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *